సల్మాన్ ఖాన్ పిల్లల కోసం ఇంత పని చేస్తున్నాడా ..!

0
208
salman khan

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికి బ్యాచిలర్ జీవితాన్ని హ్యాపీ గా గడుపుతున్నాడని అందరికి తెలుసు. 53 యేళ్ళ వయసొచ్చిన సల్మాన్ పెళ్లి రూమర్స్ ఇంకా బాలీవుడ్‌లో కోడై కూస్తున్నాయి. అప్పట్లో రొమేనియన్‌ భామ లూలియాను వివాహం చేసుకోపోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావనే లేదు. ప్రస్తుతం ఇప్పుడు మరో సారి సల్మాన్‌ పెళ్లి వార్త చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్‌ హీరో ముంబై మిర్రర్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సల్మాన్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా.. ఆసక్తికరమైన, ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విషయాన్ని సమాధానం ఇచ్చాడు. ‘నాకు పిల్లలు అంటే ఎంతో ఇష్టం. పెళ్లి చేసుకుంటే వారితో తల్లి కూడా వచ్చేస్తుంది. నాకు పిల్లలు చాలు.. తల్లి వద్దు. పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక గ్రామాన్ని కూడా సిద్ధం చేశాను ‘ అని చెప్పాడు. మరి పెళ్లి అని ప్రశ్నిస్తే .. దానికి ఇంకాస్త టైం ఉందని తప్పించుకున్నాడు.

ఈ ఇంటర్వ్యూ తర్వాతే అసలు టాపిక్ తెలిసిందంటూ సల్మాన్‌ సరోగసి కోసం సిద్ధమయ్యాడని వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. తన ఫ్రెండ్స్, సహా నటులైన షారూఖ్‌, ఆమిర్‌ వెళ్తున్న బాటలోనే వెళ్తున్నాడు అంటూ.. సరోగసి ద్వారా తండ్రి కావాలనుకుంటున్నాడు. అందుకోసమె ఒక ఊరిని సిద్ధం చేశాడని చెప్పడం వెనక ఉన్న రహస్యం అదేనని పుకార్లు షికారు చేయసాగాయి.

ప్రస్తుతం సల్మాన్‌ ‘భారత్‌’ చిత్ర ప్రమోషన్‌లో బిజిగా ఉన్నాడు. రంజాన్‌ పండగను పురస్కరించుకొని చిత్రం ప్రేక్షకులను అలరించబోతుంది. ముందుగా ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా చేస్తుందని అనుకోగా నిక్‌ జోనాస్‌తో పెళ్లి కారణంగా సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయము పై ఇప్పటికి సల్మాన్‌ విమర్శలు గుప్పించాడు. ఈ మూవీ కోసం ఎంతమందో తమ భర్తలకు దూరంగా ఉండి పని చేశారు. ప్రియాంక మాత్రం ఆమె భర్త కోసం సినిమాను వదులుకుంది అంటూ అసహనం వ్యక్తం చేశాడు.