కండల వీరుడు.. వృద్ధుడి పాత్రలో ఫాన్స్ షాక్.. ‘భరత్’ ఫస్ట్ లుక్..!

0
60
salman acting in bharath movie

బాలీవుడ్ లో టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్తో కొంతవరకు ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరిచాడు. ‘నా జుట్టు, గడ్డం నెరసిపోయి ఉండవచ్చు. కానీ నా లైఫ్ మాత్రం ఎంతో రంగులమయం’ అంటూ 2019లో విడుదల కాబోతున్న భారీ చిత్రం భరత్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను పెట్టాడు. ఈ పోస్టర్ లో సల్మాన్ సంవత్సరాల వృధ్దినిలా దర్శనమిచ్చాడు. కండల వీరుడు కాస్త వృద్ధుని రూపంలో కనిపించే సరికి అందరు ఆశ్చర్యపోయారు.

అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, టబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈసినిమాలో కండల వీరుడు ఇరవైయేళ్ల యువకుడి నుంచి డెబ్భైయేళ్ల వృద్ధుడి వరకు డిఫరెంట్ లుక్ లలో కనిపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఆ పరంగానే అభిమానులకు సల్మాన్ వృద్ధుని రూపంలో ఉన్న గేటప్ ఈరోజు పరిచయమైంది.

‘ఒక మనిషి, దేశం కలిసి చేసిన ప్రయాణం’ అని పోస్టర్‌ పై ఉన్న వ్యాఖ్యలు చిత్రం పట్ల ఎక్కువ ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 24వ తేదీన విదుదల చేస్తున్నారు. చిత్రాన్ని జూన్ 5వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.

salmankhan
bharath movie first look