30 శాతం ఈవిఎంలు పనిచేయకపోతే 80 శాతం పోలింగ్‌ ఎలా నమోదైంది బాబు..? : సజ్జల

0
166
30 శాతం ఈవిఎంలు పనిచేయకపోతే 80 శాతం పోలింగ్‌ ఎలా నమోదైంది బాబు..? : సజ్జల
30 శాతం ఈవిఎంలు పనిచేయకపోతే 80 శాతం పోలింగ్‌ ఎలా నమోదైంది బాబు..? : సజ్జల

ఈవిఎంలు మొరాయించిన తీరు.. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి డిల్లీ వెళ్లారు చంద్రబాబు నాయుడు. అది చూసిన YCP నేతలు ఓడిపోతాను అనే భయంతోనే చంద్రబాబు డిల్లీ టూర్ లు తురుగుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో బాగంగానే ఓడిపోతానని చంద్రబాబుకు ముందే తెలిసింది. అందుకనే పోలింగ్ కు ఒకరోజు ముందు నుంచి డ్రామా మొదలెట్టారు అంటూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

2014 లో ఈవిఎంలతోనే  చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ప్రజల దృష్టిలో టీడీపీ నేతలు దిగజారిపోయారు. చంద్రబాబు తెలుగువారి పరువు తీస్తున్నారు. చీప్ ట్రిక్స్ తో గందరగోళం సృష్టించే కుట్ర చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజాతీర్పును వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి హుందాగా స్వీకరించారు. 70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు సజ్జల.

బాబు డ్రామా పరాకాష్టకు చేరింది. 30 శాతం ఈవిఎంలు పనిచేయకపోతే 80 శాతం పోలింగ్‌ ఎలా నమోదైంది. బాబుకు  ఉన్న వక్రబుద్దిని వ్యవస్దలకు అంటగడుతున్నారు. ఒక్క చంద్రబాబుకు మాత్రమే అనుమానాలు వస్తున్నాయి మిగతా ఎవ్వరూ ఈవిఎంలను తప్పు బట్టడం లేదు అంటేనే అర్దం చేసుకోవచ్చు బాబు పతనం మొదలైది అని అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.