సాధినేని యామిని : 40 రోజుల్లోనే విప‌రీత‌మైన క‌రెంటు కోత‌లు..జ‌గన్ పాల‌న దారుణం..!

0
175

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న కేబినేట్ స‌హ‌చ‌రుల అవినీతి మ‌ర‌క‌ల‌ను త‌మ నేత చంద్ర‌బాబుకు రుద్దాల‌నిచూస్తే ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి సాధినేని యామిని అన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిపాల‌న మున్ముందు ఎంత దారుణంగా ఉండ‌బోతుందో గ‌త 40 రోజుల పాల‌న తెలియ‌జేస్తుంద‌ని ఆమె అన్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు టీడీపీ ప్ర‌భుత్వం 6 ల‌క్ష‌ల కోట్లు అవినీతికి పాల్ప‌డిందంటూ నాడు ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న జ‌గ‌న్ పుస్త‌కాలు రిలీజ్ చేశార‌ని, ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ అవినీతిని క‌నిపెట్టిన అధికారుల‌కు న‌జ‌రానా ఇస్తామంటూ ఆఫ‌ర్‌లు ఇవ్వ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని సాధినేని యామిని విమ‌ర్శించారు.

టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న గ‌త ఐదు సంవ‌త్స‌రాలు ప్ర‌జ‌ల‌కు అసలు క‌రెంటు కోత అంటే ఏమిటో తెలియ‌కుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసింద‌ని, కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన 40 రోజుల్లోనే రాష్ట్రంలో విప‌రీత‌మైన క‌రెంటు కోత‌లు పెరిగిపోయాయ‌ని సాధినేని యామిని అన్నారు.

మ‌రోప‌క్క పంటవేసేందుకు విత్త‌నాలు దొర‌క‌క రైతులంతా రోడ్డెక్కుతున్న ప‌రిస్థితులు నెల‌క‌న్నొయ‌ని, అదే గ‌త ఐదేళ్లు పాటించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల‌కు విత్త‌నాలు ఇవ్వ‌మే కాకుండా 27 నీటి ప్రాజెక్టుల‌ను పూర్తిచేసి సాగునీటి ఇబ్బంఇ లేకుండా చేశార‌న్నారు. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ చ‌క్క‌ని ప‌రిపాల‌న చేసిన ఘ‌నత ఒక్క చంద్ర‌బాబుకే చెల్లుతుంద‌న్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్ర‌జ‌లే వైసీపీకి త‌గిన బుద్ధిచెబుతార‌ని యామిని సాధినేని అన్నారు.