జ‌గ‌న్ ఇంటి ముందు ఆందోళ‌న‌.. సీటుపై మ‌న‌సులో మాట చెప్పిన ఆర్కే..!

0
352

2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌కు ముందుగా పెద‌కూరుపాడు అసెంబ్లీ సీటును కేటాయించార‌ని, ఆ త‌రువాత తీసేశార‌ని అయినా తాను వైఎస్ఆర్ కుటుంబాన్ని వ‌దిలిపెట్ట‌లేద‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల లోట‌స్‌పాండ్‌లోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు కేటాయించ‌ర‌న్న అనుమానంతో.. త‌న అనుచ‌రులు కొంద‌రు లోట‌స్‌పాండ్ ఆందోళన నిర్వ‌హించార‌ని, ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. త‌నకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలంటూ ఓ కౌన్సిల‌ర్ ఏకంగా రాజీనామానే చేశాడ‌ని, రాజీనామాను ఉప సంహ‌రించుకోవాల‌ని ఆయ‌న్ను కోరిన‌ట్లు తెలిపారు. త‌న‌కు వైసీపీ టికెట్ ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా జ‌గ‌న‌న్న‌కు సైనికుడిగానే ఉంటాన‌ని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ నిర్ణ‌య‌మే నిర్ణ‌యంత త‌న‌కు శిరోధార్యమ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ ఏ ఒక్క స్థానంలోనూ అభ్య‌ర్థుల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌లేదని, జ‌గ‌న్ ఏం చెప్పినా చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తాను ఎప్ప‌టికీ రాజ‌న్న వార‌సుడిగా, జ‌గ‌న‌న్న సైనికుడిగానే ఉంటాన‌న్నారు.