రూ. 1.50 కోట్లు డీల్ : వివేకా హ‌త్య కేసులో వెలుగులోకి సంచ‌ల‌న నిజం..!

0
1454

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణలో సిట్ అధికారుల బృందం స్పీడ్‌ను పెంచింది. సిట్ అధికారుల తాజా క‌ద‌లిక‌ల‌తో వివేకానంద‌రెడ్డి అనుచ‌రులు య‌ర్ర‌గంగిరెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే, వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు 15 రోజుల ముందు ఇంటి ముందు రెక్కీ నిర్వ‌హించార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగ‌ళూరులో 125 కోట్ల భూ వివాదానికి సంబంధించి గంగిరెడ్డి, వివేకానంద‌రెడ్డి మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్టుగా తెలుస్తుంది.

ఈ డీల్‌లో జ‌రిగిన రూ.150 కోట్ల లావాదేవీల‌పై సిట్ దృష్టిసారించింది. ఈ వ్య‌వ‌హారంలో గంగిరెడ్డితో ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి చేతులు క‌లిపాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు ప‌థ‌కం ప్ర‌కారం వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చ‌నిపోయాడ‌న్న డ్రామాకు తెర‌లేపింది గంగిరెడ్డి అని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని, ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌రో ప‌ది రోజుల్లో సంచ‌ల‌నం చూస్తార‌ని ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి వైరి వ‌ర్గానికి చెప్పిన అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.