బ్రేకింగ్ : అట్టపెట్టెల్లో కుక్కిపెట్టిన రూ.14 కోట్ల 54 ల‌క్షలు స్వాధీనం..!

0
104

వ‌రుస ఐటీ దాడుల‌తో త‌మిళ‌నాడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ‌త నాలుగు నెల‌ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అధికారుల దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా, ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సంస్థ‌కు సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడులు చేసి రూ.14 కోట్ల 54 ల‌క్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి..

త‌మిళ‌నాడు న‌మ‌క్క‌ల్ ప‌రిధిలోగ‌ల పీఎస్‌కే క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ రోజు ఐటీ అధికారులు దాడులు జ‌రిపారు. ఐటీ అధికారుల సోదాల్లో రూ.14 కోట్ల 54 ల‌క్షల న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. అట్ట‌పెట్టెల్లో కుక్కిపెట్టిన రూ.2వేల క‌ట్ట‌లు, రూ.500ల క‌ట్ట‌లు ఇలా మొత్తం రూ.14 కోట్ల 54 ల‌క్షల‌ను అధికారులు సీజ్ చేశారు. ఇంత‌పెద్దమొత్తంలో డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? అనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు.