థ్యాంక్స్ సర్.. అలియా భట్..!

0
178
Aliya bhatt
Aliya bhatt tweet to rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి మరో ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కథ పాత్రలు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందె. రాంచరణ్ పక్కన సీత పాత్రలో అలియాభట్ నటిస్తుందని అఫీషియల్‌ ప్రకటన చేశాడు. దీనికి అలియా స్పందిస్తూ “రాజమౌళి సర్ థాంక్స్… ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో భాగం కావడం నాకు చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన ఈ టీమ్ తో జర్నీ ఆరంబించేందుకు ఎంతో ఆసక్తి తో ఉన్నాను” అంటూ తన కృతజ్ఞతను కామెంట్ చేసింది. దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ “ఆర్ఆర్ఆర్ చిత్రంలో మీ నటనను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ” అని కామెంట్ పెట్టారు.

‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టుకు అలియాభట్‌ మాత్రమే కావాలని ఎంతగానో పట్టుపట్టి కోరాడు దర్శక ధీరుడు. అందుకే ప్రాజెక్ట్ మొదటి నుంచి అలియా పేరే బయటకు వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ కథ వింటున్నపుడే అలియాకు నచ్చి, తప్పకుండా నటిస్తానని రాజమౌళికి తెలిపింది. వరుస సినిమాలతో బిజిగా ఉన్న భామ విజయాలు తలవంచాల్సింది అన్నట్లు నటిస్తుంది. అందుకే బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మరి జక్కన్న సినిమాకి కూడా దాదాపుగా 12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. బాలీవుడ్ మార్కెట్ లో ఆమెకున్న డిమాండ్ పట్టి అలియా అడిగినంత ఇచ్చుటకు నిర్మాత దానయ్య ఏ మాత్రం తగ్గలేదని సమాచారం. మరోక వైపు సినిమాలో అలియాతో పాటు హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తుంది.