‘RRR’ షూటింగ్ ఇప్పట్లో కష్టమే..!

0
119
RRR movie latest news

బాహుబలి తరవాత దర్శక ధీరుడు రాజమౌళి సెట్స్ మీదకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ ‘RRR’. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ , కొమరం బీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి సరసన బాలీవుడ్ భామ అలియా భట్ , హాలీవుడ్ అమ్మడు ఎడ్గర్ జోన్ నటిసున్నట్లు ఒక ప్రెస్ మీట్ లో తెలిపారు కానీ ఎడ్గర్ జోన్ కొన్ని వక్తి గత కారణాల వాళ్ళ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఇక అసలు విషయానికొస్తే .. పూణే షూటింగ్ లో రామ్ చరణ్ కాలి మడిమకు దెబ్బ తగిలింది. డాక్టర్స్ సలహా మేరకు మూడు వారల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. తాజాగా రామ్ చరణ్ చెన్నై లో చదువుకున్న స్కూల్ కి వెళ్ళాడు . వీటికి సంబందించిన పోటోలను ఉపాసన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో మూడు వారాలు గడిచిన చెర్రీ ఇంకా కట్టుతోనే ఉన్నాడు. చూస్తుంటే పూర్తిగా గాయాలనుంచి కోలుకోనట్లున్నాడు.

మరో పక్క చెర్రీ గాయపడిన పదిరోజులకు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ చేయి బెణికింది.ఈ పరంగా నందమూరి కి గాయమై రెండు వారాలు కావస్తుంది. ఆ మధ్య పెళ్లి రోజు సందర్భంగా కనిపించిన ఫొటో లలో చేతి కట్టుతోనే కనిపించాడు నందమూరి.

ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్రధారులైన ఎన్టీఆర్ , చెర్రీ ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు కాబట్టి. ట్రిపుల్ ఆర్ షూటింగ్ మరి కొన్ని రోజులు వాయిదా పడేలా కనిపిస్తుంది. చేతి కట్టు తీశాక కూడా ఫిజియో థెరపీ చేపించుకోవాలి కాబట్టి దాదాపుగా ఇంకో నెల పడుతుందని, అప్పటి వరకు రాజమౌళి వెయిట్ చేయాల్సిందే అని టాక్.