యంగ్ అల్లూరి సీతారామరాజు : చరణ్, యంగ్ కొమరం బీమ్ : Jr NTR

0
141
యంగ్ అల్లు సీతారామరాజు : చరణ్, యంగ్ కొమరం బీమ్ : Jr NTR
యంగ్ అల్లు సీతారామరాజు : చరణ్, యంగ్ కొమరం బీమ్ : Jr NTR

అటు నందమూరి అభిమానులు. ఇటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బాహుబలి లాంటి సూపర్ హిట్ తరువాత “S S రాజమౌళి” అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “RRR”. రామ్ చరణ్, జూ.ఎన్‌టి‌ఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ గురించి ఎప్పుడెప్పుడు “అప్డేట్” వస్తుందా ? ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా ? అని అందరూ వైట్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో కొన్ని నిమిషాల క్రితమే ప్రెస్ మీట్ పెట్టింది RRR చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత DVV దానయ్య, దర్శకుడు S S రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్‌టి‌ఆర్ లు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్లో RRR సినిమా పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించిన రాజమౌళి… సినిమా కథ విషయంలో ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చాడు. నిజానికి రామ్ చరణ్, జూ.ఎన్‌టి‌ఆర్ లతో రాజమౌళి ఇలాంటి కథ తెరకెక్కిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.

అవును మరీ భారత స్వాతంత్ర  సమరయోదుల్లో ప్రముఖులైన అల్లూరి సీతారామరాజు, కొమరం బీమ్ అద్బుతమైన కథను సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి.. అలా అని ఇది మనకు తెలిసిన కథ కాదు.. పైగా స్వాతంత్ర పోరాటాలు కూడా ఇందులో పెద్దగా ఉండే అవకాశం లేదు.. ఎందుకంటే మనకు ఎప్పటివరకు తెలియని అల్లూరి సీతారామరాజు, కొమరం బీమ్ యవ్వనంలో జరిగిన సంఘటనలు మాత్రమే తెరకెక్కించనున్నారు రాజమౌళి.. ఇక పాత్రల విషయానికి వస్తే యంగ్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా, యంగ్ కొమరం బీమ్ గా Jr NTR నటిస్తున్నాడు.