ఎమ్మెల్యే రోజా కంట‌త‌డి..!

0
431

రెండోసారి శాస‌న సభ్యురాలిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్ట‌డ‌మ‌న్న‌ది చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. కాగా, ఈ రోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రొటెం స్పీక‌ర్ చిన వెంకట అప్ప‌ల‌నాయుడు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అంద‌రిచేత శాస‌న స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అంత‌కుముందు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు.

గతంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు అహంకార ధోర‌ణిని అవ‌లంభించి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి శాస‌న‌స‌భ సంప్ర‌దాయాల‌ను తుంగ‌లో తొక్కార‌ని ఆర్‌కే రోజా అన్నారు. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌ను కొన‌సాగించ‌కుండా వైసీపీ నేత‌లంద‌ర్నీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశార‌న్నారు. అలాంటి చంద్ర‌బాబు నాయుడుకు బుద్ది వ‌చ్చేలా దేవుడు స్క్రిప్ట్ రాశాడ‌ని, చివ‌ర‌కు కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలే టీడీపీకి మిగిలార‌న్నారు.

ఏ రోజాను అయితే అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌నీకూడ‌ద‌ని టీడీపీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని, ఆ క్ర‌మంలోనే త‌న‌ను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్ చేశార‌ని ఆమె తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌ని అసెంబ్లీని బ‌హిష్క‌రించిన వైసీపీ మ‌రో ఏడాదిపాటు ప్ర‌జా క్షేత్రంలో తిరిగింద‌ని, ఇలా రెండు సంవ‌త్స‌రాల‌పాటు తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌న తిరిగిన విష‌యాన్ని రోజా గుర్తు చేశారు. చివ‌రకు వైసీపీ అధినేత ముఖ్య‌మంత్రిగా, తామంతా ఎమ్మెల్యేలుగా శాస‌న స‌భ‌లో అడుగుపెడుతుంటే చాలా సంతోషంగా ఉంద‌ని ఆమె ఆనంద బాష్పాలు కార్చారు.