రోహిత్ శ‌ర్మ : నా గుండె భార‌మైంది..!

0
143

ఆ 30 నిమిషాలు మా జీవితంలో మ‌రిచిపోలేని చేదు అనుభ‌వాలు. ఆ స‌మయంలో మేము ఆడిన ఆట అంతా చెత్తేన‌ని అర్ధ‌మైంది. ఆ జ్ఞాప‌కాల‌ను త‌ల‌చుకుంటుంటే నా గుండె భార‌మైపోతోంది. నాకే ఇలా ఉందంటే.. మీకు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగ‌లను. కానీ ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చి.. తామెక్క‌డ క్రికెట్ ఆడినా మా వెన్నంటే ఉండి మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అంటూ సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో ఓట‌మిపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న మ‌నోవేధ‌న‌ను ట్వీట‌ర్‌లో తెలిపాడు.

అయితే, గ‌త క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ – 2019లో భాగంగా మాంచెస్ట‌ర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ సెమీఫైన‌ల్‌లో త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా 10వ తేదీ కూడా జ‌రిగింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్మాచ్‌లో భార‌త్ 18 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఓడింది. దీంతో ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. టీమిండియా మొద‌టి ఐదు ప‌రుగుల వ్య‌వ‌ధిలో మూడు వికెట్‌లు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఐదు సెంచ‌రీల‌తో దూకుడుమీదున్న రోహిత్ శ‌ర్మ సైతం ఒక్క ప‌రుగుకే ఫెవిలియ‌న్ బాట‌పట్టాడు. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ, రాహుల్ సైతం రోహిత్ శ‌ర్మ బాట‌లో న‌డిచారు. దీంతో టీమిండియా టాప్ ఆర్డ‌ర్ ఇంగ్లాండ్ నిర్దేశించిన ల‌క్ష్య చేద‌న‌లో 18 ప‌రుగుల తేడాతో ఓడింది.