ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

0
146

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న వోల్వో బస్సు.. పెళ్లి చూపులు ముగించుకుని గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాను వాహనంలోని 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

వోల్వో బస్ ఎదురుగా వస్తోన్న మోటార్ సైకిల్ ను తప్పించబోయి డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టింది. వాహనంలో 23 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా వారు వాహనంలో చిక్కుకుపోయారు.

మృతులంతా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మిగతా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.