ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. 5గురు మృతి

0
88

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై దురవరాజుపల్లి ద‌గ్గ‌ర ఈ ఉదయం 5గంటల సమయంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

కారులో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందిన విజయ భారతి(38), ప్రసన్న(14), చెన్నకేశవరెడ్డి(12), డ్రైవర్‌ ప్రేమ్‌రాజు (35), అంకయ్య(40) అక్కడికక్కడే మృతిచెందారు. అచ్చంపేట నుంచి తిరుపతికి వస్తుండగా దురవరాజుపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

రేణిగుంట పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.