చంద్ర‌బాబుపై ఎమ్మెల్యే రోజా – ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు..! బుల్లెట్ దిగిందా..? లేదా..?

0
409

మిమ్మ‌ల్ని అసెంబ్లీలో లేకుండా పంపించిన మాజీ సీఎం చంద్ర‌బాబు మిమ్మ‌ల్ని అధ్య‌క్షా అని పిలుస్తుంటే చూడాల‌ని అంద‌రూ కూడా క‌ల‌లు కంటున్న నేప‌థ్యంలో మీరేమ‌న్నా స్పీక‌ర్ కుర్చీలో కూర్చోబోతున్నారా..? అంటూ ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు నగ‌రి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా త‌న‌దైన శైలి స‌మాధాన‌మిచ్చారు.

స్పీక‌ర్ ప‌ద‌విని అలంక‌రించేంత వ‌య‌స్సు .., అనుభ‌వం త‌న‌కు లేద‌ని ఎమ్మెల్యే రోజా స‌మాధాన‌మిచ్చారు. అలాగే వైసీపీలో అనేక‌మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు చాలామందే ఉన్నారని, తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాన‌ని క‌నుక స్పీక‌ర్ ప‌ద‌వికి తాను స‌రిపోన‌నే రీతిలో ఆమె జ‌వాబిచ్చారు.

ఇంత‌లో మ‌ళ్లీ క‌ల‌గ‌జేసుకున్న మీడియా ప్ర‌తినిధి.., ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. రోజా ఎక్క‌డ ఉన్నా కూడా ఆమెపాత్ర ఆమె పోషిస్తారు. అలాగే స్పీక‌ర్ కుర్చీలో కూర్చుంటే చంద్ర‌బాబు అధ్య‌క్షా అని పిలుస్తున్న స‌మ‌యంలో ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి..? అని చూడాల‌న్న త‌ప‌న ప్ర‌తి ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌లో ఉంద‌ని ప్ర‌శ్నించ‌గా, నిజంగానే తాను స్పీక‌ర్‌గా ఎన్నికైతే చంద్ర‌బాబు అసెంబ్లీకి వ‌స్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కైతే లేద‌ని ఆమె అన్నారు.