లేటెస్ట్ కౌంట‌ర్ : ఎమ్మెల్యే రోజా ఏమ‌న్నారంటే..!

0
208

విలువ‌ల గురించి టీడీపీ నేత‌లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు ఉంద‌ని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. సంప్ర‌దాయాల గురించి మాట్లాడే అర్హ‌త టీడీపీ నేత‌ల‌కు లేద‌ని ఆమె అన్నారు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన త‌మ్మినేని సీతారాం స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టినందుకు అదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడుకు క‌డుపు మండిపోతుందంటూ రోజా కౌంట‌ర్ వేశారు.

స్పీక‌ర్‌ను అవ‌మానించ‌డంలో, స్పీక‌ర్ చైర్‌ని ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు వెన్న‌తోపెట్టిన విద్య అన్న‌ది అంద‌రికీ అర్ధ‌మ‌య్యే విష‌య‌మ‌ని రోజా విమ‌ర్శించారు. గతంలో కిర‌ణ్ కుమార్‌రెడ్డి స్పీక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న్ను గౌర‌వించ‌కుండా అవ‌మానించిన తీరు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ చూశార‌న్నారు. అటువంటి స‌న్నివేశం మ‌ళ్లీ మీరు స్పీక‌ర్ అయిన‌ప్పుడు రిపీట్ అయిందంటూ త‌మ్మినేని సీతారాంను ఉద్దేశించి ఆమె అన్నారు.