ఎమ్మెల్యే రోజా : ర‌క్తం ఉడికిపోయింది..!

0
575

నాయకుడు అనేవాడు ఏ లైన్ తీసుకుని వెళ‌తాడో.. ఆ లైన్ ప్ర‌కార‌మే పార్టీ స‌భ్యులంతా వెళ‌తార‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు. కాగా ఈ రోజు ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ గ‌తంలో తాను చూసిన చంద్ర‌బాబుకు, 2014లో తాను చూసిన చంద్ర‌బాబుకు చాలా తేడా ఉంద‌న్నారు.

గ‌తంలో చంద్ర‌బాబుకు అడ్మినిస్ట్రేట‌ర్‌గా చాలా మంద‌చి పేరు ఉండేద‌ని, ఆయ‌న చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌గ‌ల రాజ‌కీయ నాయ‌కుడు అని అంద‌రూ అనుకునేవారు.., కానీ 2014లో మాత్రం ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి పూర్తిగా మారిపోయింద‌ని రోజా అన్నారు. వీధుల్లో బోర్లు వ‌ద్ద కొట్టుకునే ఆడాళ్ల మాదిరి అసెంబ్లీ పవిత్ర‌త‌ను చంద్ర‌బాబు అప‌హాస్యం చేశార‌న్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో అస‌భ్య‌క‌ర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుంటే సీఎం స్థాయిలో ఉన్న చంద్ర‌బాబు, స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ ప్రోత్స‌హించార‌ని, ఆ స‌మ‌యంలో త‌మ ర‌క్తం ఉడికిపోయేద‌ని ఎమ్మెల్యే రోజా చెప్పారు. అలా టీడీపీ శ్రేణులు చేసిన అన్ని త‌ప్పుల‌కు నేడు భ‌గ‌వంతుడు వారికి ప‌నిష్‌మెంట్ ఇచ్చార‌ని రోజా వ్యాఖ్యానించారు.