సీఎం జ‌గ‌న్ కేసుల‌పై ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
532

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని కేసుల్లో ఇరికించ‌డ‌మన్న‌ది క‌చ్చితంగా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. సీఎం జ‌గ‌న్‌కు క‌చ్చితంగా మంచి రోజులు వస్తాయ‌ని, ఆయ‌న‌పై ఉన్న కేసుల‌న్నీ కూడా ప‌టాపంచ‌లు అవుతాయ‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అలాగే సీఎం జ‌గ‌న్‌లో ఉన్న పోరాట ప‌ఠిమ‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు స‌హాయం చేస్తార‌ని తాను భావిస్తున్నాన‌ని రోజా అన్నారు. గ‌తంలో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానిని క‌లిసిన ప్ర‌తిసారి ఏపీకి ఏం కావాలో అడ‌గ‌డ‌ని, జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను తిర‌గ‌దోడ‌మ‌ని మాత్ర‌మే అడుగుతాడ‌ని ఒకానొక స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే చెప్పిన విష‌యాల‌ను రోజా గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం నిధుల‌తోపాటు ప్ర‌త్యేక హోదా తెచ్చే ఏకైక నాయ‌కుడు సీఎం జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.