2050 నాటికి భార‌త్ జనాభా ఎంతో తెలుసా..?

0
114

మ‌రో ఎనిమిదేళ్ల‌లో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశం చైనాను భార‌త్ అధిగ‌మించ‌బోతుంద‌ని ఐక్య‌రాజ్యస‌మితి నివేదిక వెల్ల‌డించింది. ఈ సంవ‌త్స‌రం నుంచి 2050 మ‌ధ్య భార‌త్ జ‌నాభా దాదాపు 27 కోట్లు పెరుగుతుంద‌ని అంచ‌నా వేసింది. ఈ శ‌తాబ్దం చివ‌రి నాటికి భార‌త్ అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా కొన‌సాగ‌నుంద‌ని పేర్కొంది.

వ‌చ్చే 30 ఏళ్ల‌లో ప్ర‌పంచ జ‌నాభా 200 కోట్లు పెరుగుతుంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి అంచ‌నా వేసింది. ప్ర‌స్తుత ప్ర‌పంచ జ‌నాభా 730 కోట్లు. 2050 నాటికి ఆ సంఖ్య 970 కోట్ల‌కు చేరుతుంద‌ని వివ‌రించింది. ఈ శ‌తాబ్దం చివ‌రి నాటికి ప్ర‌పంచ జ‌నాభా 1100 కోట్ల‌ను దాటుతుంద‌ని తెలిపింది. 2050లో ఉండే జ‌నాభా పెరుగుద‌ల‌తో 50 శాతం కేవ‌లం తొమ్మిది దేశాల్లోనే న‌మోద‌వుతుంద‌ని వెల్ల‌డించింది.