జగన్ పై సంచలన వీడియో రిలీజ్ చేసిన : ఆర్జీవీ

0
367
ram gopal varma tweet

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయినందుకు గాను… వైఎస్ జగన్ గెలిచినందుకు గాను.. తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ ట్విట్టర్ ల వర్షము నిన్నటినుంచి కురిపిస్తూనే ఉన్నాడు. ఒక పక్క సైకిల్ టైర్ పంక్చర్ అయిందంటూ… టీడీపీ పార్టీ జనన , మరణాలంటూ ట్వీట్ లు వదిలారు. తాజాగా నారా చంద్ర బాబు నాయుడు మీద వైసీపీ అధినేత జగన్ ఘన విజయాన్ని సాదించారంటూ వీడియో సాంగ్ ని వదిలారు.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ‘ విజయం విజయం’ అనే వీడియో పాటలో జగన్ , చంద్రబాబు నాయుడు కు సంబందించిన వీడియోలను మిక్స్ చేస్తూ ట్వీట్ లో పోస్ట్ చేశారు.

‘విజయం విజయం ఘన విజయం… విజయం విజయం శుభ సమయం… జయహో నాదం.. యేదలో మోదం.. వదనాల వెలిగే హాసం… గుండెల్లో లోలోపల ఆనందం…’ అంటూ కొనసాగే పాటలో చంద్రబాబు పై వైఎస్ జగన్ గెలిచినందుకు దివంగత సీనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కూడా హర్షము వ్యక్తం చేస్తున్నట్లు వీడియోలో వీక్షిణించవచ్చు. ఈ సినిమాను మే 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.