ప్రేక్షకులను మెప్పించిన.. మహానాయకుడు..!

0
133
NTR Mahanayakudu
NTR Mahanayakudu review

దివంగత సీనియర్ ఎన్టీరామారావు బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సీనియర్ ఎన్టీరామారావు రాజకీయరంగ ప్రవేశం ఎలా చేశాడు? అతి తక్కువకాలంలో పార్టీ స్థాపించిన నేతగా మహానాయకుడిగా ఎలా ఎదిగాడు? ప్రజల్లో తనకంటూ ప్రత్యేకత ఎలా సాదించాడు? ఇలా రాజకీయ జీవితం గూర్చి మహానాయుడి రెండో భాగంలో చూపించారు. ఈ సినిమాని  ఈరోజు విడుదల చేశారు.

కథలోకి వెళ్తే ..

ఇది మా నాన్న కథ.. మనందరి కథ.. అమ్మా నాన్నల కథ చెప్పాలని దేవుడు నన్ను ఆశీర్వదించాడు . అందుకే ప్రేక్షక దేవుళ్లందరికి అందిస్తున్నాను. మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తూ, విశ్వసిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ అని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జీవిత కథలోకి ప్రేక్షకులను తీసుకవెళ్లారు బాలయ్య బాబు.

ఈ చిత్రంలో ఎన్టీరామారావు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు. అతి తక్కువ కాలం లో పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టడం. ప్రజల దగ్గరకు పథకాలను ప్రవేశ పెట్టడం, వాటితో ప్రజాదారణ ఎలా పొందాడు. ప్రజల్లో, పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకొని సీఎం కుర్చీకి దూరమవుతాడు. ఎన్టీఆర్‌ కి బాగా నమ్మకస్థుడైన నాదెండ్ల భాస్కరరావు మోసం చేసి ముఖ్యమంత్రి సీట్ కి దూరం చేస్తాడు. ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రపతిని కలవటం,  తర్వాత ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తాడు.

ఆ తర్వాత బసవతారకం అనారోగ్యానికి గురైనపుడు ఎన్టీఆర్ లో కలిగిన బాధను క్షుణ్ణంగా చూపించి, వారిద్దరూ కలిసి విశ్రాంతికై వెళ్లి గడిపిన క్షణాలను చూపించారు. క్యాన్సర్‌తో బాధ పడుతున్న బసవతారకం చివరి కోరిక ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది. ఆమె కోరిక నెరవేరడం తో చిత్రం ముగుస్తుంది.

ఎన్టీఆర్ తిరిగి సీఎం పదవి చేపట్టుటకు ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాడు. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి ?తన నాభార్య బసవతారకం పాత్రకు ఈ చిత్రం లో ఎంతవరకు ప్రాధాన్యత చూపించారు? తొలిభాగంలో కి, రెండో భాగంలో లోకి మధ్య గల సక్సెస్ తేడాలేంటని తెరపై నే చూడాలి. ‘కథానాయకుడు’ చిత్రం కొంతవరకు నిరాశపరచినా, ‘మహానాయకుడు’ పై అభిమానుల ఆశలు ఫలించినట్లుందని చెప్పక తప్పదు.

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్ , ఆమని,కళ్యాణ్ రామ్, రానా
బ్యానర్ : ఎన్.బి.కే ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే,దర్శకుడు : క్రిష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.ఎస్
సంగీతం: ఎం.ఎం కీరవాణి
ఎడిటర్: అర్రామ్ రామకృష్ణ

 Rating: 3/5