ఎంపీ రేవంత్‌రెడ్డి : బీజేపీలో చేరిక‌పై క్లారిటీ..!

0
149

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మ‌రికొద్ది రోజుల్లో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు స్వ‌యాన ఆయ‌నే స‌మాధాన‌మిచ్చారు. కాగా ఇటీవ‌ల కాలంలో కొన్ని సోష‌ల్ మీడియా వెబ్‌సైట్‌ల‌లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి ప్ర‌ధాని మోడీ స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకోనున్నారంటూ ప‌లు క‌థ‌నాల‌ను ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. దీంతో స్పందించిన రేవంత్‌రెడ్డి త‌న‌దైన మాస్ పొలిటిక‌ల్ స్టైల్‌లో ఆన్స‌ర్ ఇచ్చారు. ఇంత‌కీ రేవంత్‌రెడ్డి ఏం చెప్పారంటే..?

కాగా, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ రోజు తిరుమ‌ల తిరుప‌తిలో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం త‌నను ప‌ల‌క‌రించిన మీడియా ప్ర‌తినిధుల‌తో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఇంత‌కీ మీరు బీజేపీలో చేర‌నున్నారంటూ వ‌స్తున్న వంద‌తుల‌పై మీ స‌మాధానం అని అడిగిన మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్న‌కు రేవంత్‌రెడ్డి సమాధాన‌మిస్తూ బుర్ర ఉన్న‌వాడెవ‌డైనా బీజేపీలో చేరుతాడా..? అంటూ ఎద‌రు ప్ర‌శ్నించారు.

తాను బీజేపీలో చేరే ప్ర‌స‌క్తే లేద‌ని రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. పార్టీ మారుతున్నానంటూ కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఒక‌వేళ తాను బీజేపీలో చేరితే త‌న‌ను ప్ర‌ధానిని చేయ‌రు క‌దా..?, అయినా నేను బీజేపీలో ఎందుకుపోతాను.. వారొస్తున్నారు.. వీరొస్తున్నారంటూ ఆ పార్టీ నాయ‌కులు హ‌డావుడి చేస్తున్నార‌ని, ఆ వ‌దంతులు అర్ధ‌ర‌హిత‌మ‌న్నారు. చ‌ట్ట స‌భ‌ల్లో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకే ప్ర‌జ‌లు త‌న‌ను ఎంపీగా గెలిపించార‌ని, తాను ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటాన‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు.