బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌..!

0
266

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం తాలూక షాక్ నుంచి టీడీపీ నేత‌లు తేరుకోలేక‌పోతున్నారు. మ‌రికొంత మంది అయితే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వారి మొఖాల‌ను కూడా చూపించ‌లేని ప‌రిస్థితి. ఇదిలా ఉండ‌గా గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో ఇద్ద‌రంటే ఇద్ద‌రే విజ‌యం సాధించారు. వారిద్ద‌రిలో ఒక‌రు పార్టీని వీడేందుకు సిద్ధప‌డ్డారా..? అంటే అవునంటూ ప‌లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రు..? చ‌ంద్ర‌బాబుకు బైబై చెప్పేందుకు ఎందుకు సిద్ధ‌ప‌డ్డారు..? చిన్న‌చూపే కార‌ణ‌మా..? పార్టీ నుంచి జంప్ చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ప‌లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్న అంశాలు ఇలా ఉన్నాయి.

కాగా, గుంటూరు జిల్లాలో అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ రేప‌ల్లె టీడీపీ టికెట్‌పై రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని జిల్లాగా పేర్కొంటున్న గుంటూరు జిల్లాలో టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబుకు సంబంధించిన సామాజిక‌వ‌ర్గం నేత‌లే ఎక్కువ‌గా ఉండ‌టంతో, వేరే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే అన‌గాని ప్ర‌సాద్‌ను వారు రాజ‌కీయంగా అణ‌చివేశార‌ని ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం చెప్పుకొస్తుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీకి భ‌విష్య‌త్ ఉండ‌బోద‌ని భావించిన ఆయ‌న పార్టీ మార్పుపై త‌న అనుచ‌ర‌వ‌ర్గంతో స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని, అతి త్వ‌ర‌లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ ప‌లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం