నెటిజెన్ బూతు కామెంట్.. కన్నీటి ఆవేదనలో రేణు దేశాయ్..!

0
457
Renudeshai
Renudeshai latest instagram post

ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసుకొని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది . సోషల్ మీడియా ప్రస్తుతానికి ఒక చర్చా వేదికగా మారింది. ఎవరికి నచ్చినట్లు వారు ఇప్పటివరకు వినని, కనని బూతు పదజాలాన్ని వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. సెలబ్రిటీలను కూడా వదలకుండా వారికి ఏదనిపిస్తే, అది వాడేస్తూ వాళ్ళు ఎంత భాద పడతారని కూడా ఆలోచించట్లేదు. సామాజిక వేదికలో కామెంట్ల వర్షం కురిపిస్తూ వారి కన్నీటి కారణము అయ్యేలా అసభ్యకర పదజాలాన్ని వాడటం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ఒక యూసర్ కామెంట్ కి రేణు దేశాయ్‌ ఎంతగా భాదపడిందో ఆమె పోస్ట్ చేసినది చూస్తే అర్ధమవుతుంది.

రేణుదేశాయ్‌ని ఈ మధ్య రైతులను పలకరిస్తూ, వారి కష్టాలను పంచుకుంటూ గుంటూరు జిల్లాలో పర్యటిస్తుంది. వాటికి సంబందించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతే ఇక నెటిజెన్ ఆ పోస్టులకు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ కామెంట్ చేశాడు.

‘నేను ఒక రైతుబిడ్డను. రెండు దశాబ్దాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. మీ లాంటి “బూతు పదజాలం(F)” వాళ్లు రైతుల కోసము ఏమి చేశారు..? ఏమీ చేయలేదు..? డబ్బుల కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామాలు ఆడుతున్నారు’ అంటూ అసభ్యంగా కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కి రేణు ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది.

రేణుదేశాయ్‌ యూజర్ పెట్టినా కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి సమాధానంగా ఇన్ స్టాగ్రామ్ లో తన భాదను పోస్ట్ చేసింది:

‘‘ఈ పోస్ట్ కచ్చితంగా చదువుతారనే అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడన్నా ‘F’ అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు.

కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు! ఏంటి ఇది ? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే ఏది అనొచ్చు దూషించొచ్చు. అవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలి సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురికాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి… సెలబ్రిటీలకు ఉండకూడదు! ప్రతి రోజూ మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి…

అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా లేక పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదన్నా కారణం కోసం చేస్తున్నానా అన్నది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలు ఎంత వరకు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం అన్నది ముఖ్యం! ఏదో ఒక రోజు ఏ ఊరూ పేరూ లేని ఈ ట్రోల్ చేసే వాళ్లంతా వారి తప్పు తెలుసుకుని వారి శక్తి సామర్థ్యాలని ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం పెట్టకుండా ఏదైనా మంచి పని కోసం పెడితే మంచిది’’.

యూజర్ పెట్టినా కామెంట్:

రేణుదేశాయ్ ఆవేదన :