చంద్ర‌బాబు గుర్తు పెట్టుకో.. నీకు మిగిలింది 125 రోజులే..!

0
121

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోస్ట్ ఫైర్ బ్రాండ్‌ల‌లో ఒక‌రైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోమారు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై త‌న‌దైన శైలిలో విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు. చంద్ర‌బాబు స‌ర్కార్ గ‌త నాలుగేళ్ల నుంచి అబ‌ద్ధ‌పు హామీలు, అవినీతితో ప్ర‌జ‌ల‌ను నిలువెల్లా మోసగించింద‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కాగా, ఎమ్మెల్యే కొడాలి నాని ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోని మంత్రులు, నాయ‌కులు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని ప‌దే ప‌దే విమ‌ర్శించ‌డాన్ని ఖండించారు. ఈ పోటుగాళ్లు (టీడీపీ) ఏమ‌న్నా 365 రోజుల‌పాటు అసెంబ్లీకి వెళ్తున్నారా.? లేదే..? కాక‌పోతే శీతాకాలం, వ‌ర్షాకాలం, బ‌డ్జెట్ సెష‌న్ అంటూ మ‌హా అయితే 30 రోజుల‌పాటు స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. మిగిలిన 330 రోజుల‌పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు క‌దా..!

మిగిలిన 330 రోజుల‌కు జీతాలు తీసుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ జీతాల‌ను వెన‌క్కు ఇచ్చేస్తే తాము కూడా దానికి సిద్ధ‌మ‌ని, వైసీపీ ఎమ్మెల్యేలంతా వెన‌క్కు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామ‌ని కొడాలి నాని స‌వాల్ విసిరారు. సీఎం చంద్ర‌బాబు గురించి మాట్లాడుతూ.. నీ టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఇక నీకు మిగిలింది కేవ‌లం 125 రోజులే, గుర్తుపెట్టుకో అంటూ ఎద్దేవ చేశారు.

అస‌లే రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే, చంద్ర‌బాబు వారికి సైతం క‌న్నాలు వేసి దోచుకున్న ఆరు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టేందుకు రెడీ అయ్యాడ‌ని కొడాలి నాని విమ‌ర్శించారు. అంతేకాకుండా, నాలుగున్నారేళ్ల‌లో చేయ‌ని అభివృద్ధిని ఎన్నిక‌ల ముందు చేస్తానంటూ శంకుస్థాప‌న రాళ్ల‌ను పాతుతున్నార‌ని, చంద్ర‌బాబు చేస్తున్న కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని స‌ముద్రంలో క‌లిపేందుకు ప్ర‌జ‌లంద‌రూ సిద్ధంగా ఉన్నార‌న్నారని కొడాలి నాని చెప్పారు.