తల్లీకూతుళ్లను చెట్టుకు కట్టేసి వివస్త్రల్ని చేసిన బంధువులు

0
113
ap latest news

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు దళిత పేట లో దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. పొలానికి సంబంధించిన విషయంలో గొడవలు జరగడంతో ఒక మహిళను చెట్టు కట్టేసి ఆమె వస్త్రాల్ని చింపి వేయటంతో పాటు కారం చల్లి కొడుతుంటే ఆమె కుమార్తె 11 ఏళ్ల బాలిక అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ బాలిక వస్త్రాలను కూడా చింపి కొట్టి విధుల్లో ఈడ్చుకెళ్లారు. కాపాడలిని తల్లి కూతుర్లు అరుపులు కేకలు వేసిన కాపాడటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లోని దళిత పేట కు చెందిన సల్మాన్ రాజ్ అనే వ్యక్తి విశాఖ లోని ఎస్ బి ఐ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అయితే ఇతనికి బిక్కవోలు లోని దళిత పేట లో ఒక ఇల్లు వుంది. వీరి ఇంటి పక్కనే వారి బంధువులైన ఒక మహిళా తన కూతురు 11ఏళ్ల బాలికతో కలిసి నివాసంఉంటుంది. అయితే సల్మాన్ రాజ్ కు ఆ మహిళకు మధ్య స్థలానికి సంబంధించిన విషయంలో చాల కాలంగా వివాదం ఉన్నపటికీ కూడా నిన్న ఆ సరిహద్దులో మంచినీటి కొళాయి వేయడం తో ఈ ఇద్దరి మధ్య గొడవలు జరగడం జరిగింది.ఈ గొడవ కాస్త పెద్దగా జరిగింది.

సల్మాన్ రాజ్ అనే వ్యక్తి ఆ మహిళా పట్ల అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. ఆమె పై కుటుంబ సభ్యులు మరొక ఐదురుగు కలిసి ఈ స్థలానికి అడ్డువస్తుందిని ఆ మహిళను చెట్టుకు కాటేసి కంట్లో కారం కొట్టి కొట్టడం జరిగింది. అయితే అదే సమయంలో అడ్డుకోవడానికి వెళ్లిన ఆమె కుమార్తె ను కూడా 11 ఏళ్ల బాలిక ను కూడా చెట్టు కు కట్టేసి , తల్లీకుమార్తెలను వివస్త్రలుగా చేసి ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం విచక్షణారహితంగా చావబాది , వీధుల్లో ఈడ్చుకెళ్లారు.

అయితే వారి ఇంటి పక్కనే ఉన్న 7 ఏళ్ల బాలుడు ఈ ఘటన ను తన సెల్ ఫోన్ లో వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో తీయడం తో ఈ అరుపులు కేకలు స్థానికులు విని బయటకు వచ్చి వారిని కాపాడటం జరిగింది. వెంటనే స్థానికులు ఫోన్లో తిసిన వీడియో ను మరియు బాధితురాలను తీసుకెళ్లి బిక్కవోలు పోలీసులు కు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఈ తల్లీకూతుర్లను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. అయితే సల్మాన్ రాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.