గుడ్ న్యూస్ : త‌గ్గిన పెట్రోల్‌ ధ‌ర‌..!

0
132

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరు 72.80 రూపాయలు ఉండగా, లీటరు పెట్రోలు ధర రూ. 66.11 వద్ద ఉంది. ఇక్కడ పెట్రోలు ధరలు లీటరుకు 5 పైసలు త‌గ్గాయి. అయితే, డీజిల్ ధరలు దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లోనే త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

ముంబైలో పెట్రోలు కోసం 78.37 రూపాయలు చెల్లించాల్సి ఉండ‌గా, డీజిల్ ధర లీటరుకు రూ.69.19 చొప్పున చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా కోల్‌క‌తాలో పెట్రోలు, డీజిల్ లీటరుకు 74.82 రూపాయలకు, లీటరుకు రూ .67.85 గాను విక్రయిస్తున్నారు.

చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ .75.56, లీటరు రూ .69.80. నోయిడాలో పెట్రోలు ధర రూ .72.15 వద్ద ఉంది. డీజిల్ ధర రూ. 65.23 వద్ద ఉంది. గురుగ్రాంలో, పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ .72.69 మరియు రూ. 65.33 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 4 రూపాయల మేర పెరిగింది. డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరు 5 రూపాయలు పెరిగాయి. గత నెలలో గ్లోబల్ క్రూడ్ ధరలు7 శాతం పెరిగాయి.