గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్‌..?

0
279

ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండుచోట్ల రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వివేది కేంద్ర ఎన్నిక‌ల అధికారికి ప్ర‌తిపాద‌న‌లు పంపారు. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 244వ పోలింగ్ కేంద్రం, న‌ర‌సారావుపేట‌లోని 94వ పోలింగ్ కేంద్రాల‌కు రీపోలింగ్ నిర్వ‌హించాలని పంపిన గుంటూరు క‌లెక్ట‌ర్ సిఫార్సులను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపిన‌ట్టు ద్వివేది తెలిపారు. సీఈసీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామ‌ని, ఆదేశాలు వ‌చ్చిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ద్వివేది అన్నారు.