నడిరోడ్డు పై యాక్సిడెంట్ చేసిన రష్మీ..! తీవ్ర గాయాలపాలైన వ్యక్తి..!

0
199
Rashmi
Rashmi

బుల్లితెర పై నానా హంగామా చేస్తూ.. అలరిస్తున్న యాంకర్లలో సుమ, ఝాన్సీ, ఉదయభాను లతో పాటు జబర్దస్త్ షో ద్వారా అల్లరి చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మీ, అనసూయ. నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను అత్యధికంగా ఆకట్టుకున్న షోకి హోస్ట్ గా వ్యహరిస్తున్నది రష్మీ. బుల్లి తెర మీదే కాకుండా, వెండితెర మీద ఛాన్సులు కొట్టేస్తుంది. అప్పుడప్పుడు పలు చోట్ల రిబ్బెన్ కటింగ్ వంటి వాటికి హాజరవుతూ చేతుల నిండా సంపాదిస్తుంది.

ఈ మధ్య రష్మీ ఒక కొత్త కారు కొనింది. అందులో వైజాగ్ లో ఓ కార్యక్రమము ముగించుకొని హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో రోడ్ మీద ఒక వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటన అర్ధరాత్రి 11 గంటలకు జరుగగా, అక్కడికి హుటాహుటిగా పోలీసులు చేరుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం ..

రష్మీ తన కొత్త కారులో విశాఖపట్నం జిల్లాలోని గాజువాక వద్ద కూర్మన్నపాలెం రోడ్డు లో వెళ్తున్న సమయాన ఓ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఆ వ్యక్తి తీవ్రమైన గాయాలపాలవ్వడంతో, పోలీసులకు సమాచారం అందగానే స్పాట్ కి చేరుకున్నారట. అప్పటికే గాయాలపాలైన వ్యక్తిని  అదే  కారులోనే దగ్గరలో నున్న సర్కారు దవాఖానకు తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. క్షతగాత్రుని దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం చిత్తూరు జిల్లా గుర్రంకొండకు సంబందించిన లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో రష్మీ , తన తల్లి కూడా ఉన్నారు.  ఈ కారు నెంబర్ TS11 EE 1789 మీద ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ఆరు చలానాలు ఉన్నాయట. పోలీసులు ఈ కేసుపరంగా రష్మి కారు డ్రైవర్ అయినా ఎం.ఎ గౌతమ్‌ని అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే రష్మీ వేరే కారులో వెళ్లిపోయిందట. ఈ ప్రమాదం జరుగునపుడు రష్మీ నడిపిందా? డ్రైవర్ నడిపాడా ? యాక్సిడెంట్ జరుగుటకు అసలు కారణమేంటి? ఎలా జరిగింది? అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

 Read alsoరకుల్ ప్రీత్ పై.. రష్మీ కామెంట్ ..!