ప‌దేళ్ల బాలిక‌ను నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..!

0
128

పాఠ‌శాల‌లో విద్య‌న‌భ్య‌సించేందుకు వ‌చ్చిన ప‌దేళ్ల విద్యార్థినిపై స్వీప‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. విద్యార్థిని మాన‌సిక స్థితిలో మార్పులు రావ‌డంతో అనుమానం వ‌చ్చి అడిగిన త‌ల్లిదండ్రుల‌కు అస‌లు నిజం తెలిసింది. దీంతో ఆ బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని త‌రుపు త‌ల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స్వీప‌ర్‌పై ఫోక్సో చ‌ట్టం కింద, ఇంకా ప‌లు సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున జ‌రిగిన ఈ అమానుష ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. బాధితురాలు బాలిక‌ది స్వ‌స్థ‌లం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ మారుమూల గ్రామ‌మ‌ని, బాలిక‌ను చ‌దువు నిమిత్తం ఢిల్లీలోని బంధువుల ఇంటికి పంపించార‌న్నారు. ద‌గ్గ‌ర‌ల్లోని ప్ర‌భుత్వ మున్సిప‌ల్ స్కూల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న ఆ బాలిక‌ను ఈ నెల 5న స్వీప‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని, బాలిక అనారోగ్యానికి గురి కావ‌డంతో ఆ విషయం వెలుగులోకి వ‌చ్చింద‌ని, దీంతో బాలిక త‌ల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌న్నారు. నిందితుడు స్వీప‌ర్‌ను అరెస్టు చేశామ‌ని పోలీసులు తెలిపారు.