నారా లోకేష్ ఒక అబద్దం.. నిజమైన వారసుడున్నాడు..! వర్మ సంచలన ట్వీట్..!!

0
179
junior ntr
junior ntr is the real Successor of tdp

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో టీడీపీ నేతలకు, చంద్రాబునాయుడుకు షూటింగ్ మొదలు నుంచి విడుదల వరకు నిద్ర కరువయ్యేలా చేశాడనే చెప్పాలి. ఎట్టకేలకు ఎన్నిఅడ్డంకులు వచ్చిన సినిమా విడుదల చేశాడు. టీడీపీ వారు ఆంధ్రలో రిలేజ్ చేయకుండా సక్సెస్ అయ్యారు కానీ, ప్రపంచ వ్యాప్తంగా అడ్డుకోలేక పోయారు. ఈ సినిమాతో నిజాలు బయట పెడుతున్నానని రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నిజ స్వరూపం చూపించాడు. అంతే ఇక చంద్రబాబు కు ఎంత నష్టం వాటిళ్లలో వాటిల్లింది. ఇది కాస్త టీడీపీ పార్టీ మీద ప్రభావం పడింది. బాక్సాఫీసు వద్ద బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు,’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ డిజాస్టర్ ను ఎదుర్కొనింది. ఈ విషయం పక్కకు పెడితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు, బాలయ్యబాబులకు మింగుడు పడట్లేదట.

Junior ntr and senior ntr
Junior ntr and senior ntr

తాజగా రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్టర్ లో ‘టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు ముద్దులు కొడుకు లోకేష్ బాబు ఒక అబద్ధం అంటూ.. టీడీపీ అసలైన వారసుడు జూనియర్ ఎన్టీరామారావు అని ట్వీట్ చేశాడు. నందమూరి వారసుడు.. తాతకు తగ్గ్గ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసాడు. అంటే చంద్రబాబు నాయుడుకి, నందమూరి వంశానికి, అభిమానులకు నిజాన్ని మరోసారి తెలియచేసే ప్రయత్నం చేశాడు వర్మ. చంద్రబాబు నాయుడు, లోకేష్ అప్పనంగా అనుభవిస్తున్నాడని బాగానే చెప్పాడు.

2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో తాత ఎన్టీఆర్‌ మాదిరిగానే ఖాకీ డ్రెస్ ధరించి ప్రచారం చేయడం మరో విషీశం. అప్పట్లో ఎన్టీఆర్ వారసుడొచ్చాడు అనుకునేలా కనిపించాడు. ఫొటో చూసిన ప్రతి ఒక్కరు తాత కు తగ్గ మనవడు అనక తప్పదు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో లక్ష్మీ పార్వతి కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి అధ్యక్షత వహిస్తే తప్పకుండా కలుస్తానని చెప్పింది.

rgv tweet
rgv tweet on naara lokesh

మరో పక్క చూసుకుంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి ఎన్నికగోల తప్పించుకొని RRR సినిమా షూటింగ్ బిజీ లో ఉన్నాడు. ప్రచారంలో కాకపోయినా ఎన్నికల పోలింగ్ సమయానికైనా వస్తారో.. రారో.. అని డౌట్ అనుకుంటున్నారు అభిమానులు.