ఎన్నికల వేడికి దూరంగ రామ్, తారక్ లు ఎందుకంటే..!

0
705
ram charan
RRR movie

ఏపి లో ఎన్నికల వేడి కొనసాగుతుండగా.. టాలీవుడ్ స్టార్స్ కొంతమంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సినీరంగం కేర్ అఫ్ అడ్రస్ రాజకీయం అన్నట్లు తయారవుతుంది. షూటింగ్ లకు బ్రేక్ లు వేసి మరి ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ సాకు తో వడోదరలో ఎంజాయ్ చేస్తున్నారు. 45 రోజుల పాటు షెడ్యూల్ బిజీ చేసేసుకున్నారు. అహ్మదాబాద్, ముంబై, పూణే, మహారాష్ట్ర ఇలా కొన్నిప్రదేశాలలో చిత్రీకరణ చేయనున్నారు.

ఈ రాజకీయ వేడికి రామ్ చరణ్, తారక్ దూరంగా ఉండటమే కాదు..షూటింగ్ లో కాలి దొరికితే చాలు టూ వీలర్ మీద చక్కర్లు కొడుతున్నారు. ఈ వీడియో కాస్త లీక్ అవడంతో అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. తారక్ టీడీపీ పార్టీ కి, రాంచరణ్ బాబాయ్ జనసేన పార్టీ కి తోడైతే బాగుందని మరి కొందరు అభిప్రాయం పడుతున్నారు.

ఏది ఏమైనా సొంత ఇంట్లో వారు మాత్రం ఈ సమయాన తోడుంటే పార్టీలకు మరింత హెల్ప్ అయ్యేదని వాదన. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఆ టైం వరకైనా ట్రాక్, చరణ్ లు ఓటు వేస్తారో లేదో అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కప్పుడు జనసేనకు మద్దతు తెలిపాడు చరణ్. ఏది ఏమైనా చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్నికల గోల తప్పించుకున్నారు.