రాళ్ళపల్లితో ‘చిరు’అనుబంధం

0
171

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాళ్లపల్లి తో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన రాళ్లపల్లి మృతికి సంతాపం తెలిపిన చిరు.. ఆయనతో తన మొదటి అనుభవాన్నిగుర్తుచేసుకున్నారు.

చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు రాళ్లపల్లిని మొదటిసారి కలిశానని చిరంజీవి చెప్పారు. రాళ్లపల్లి నటన సహజ నటుడని.. అందుకే ఆయనంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని.. అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.