ఛాన్స్ కొట్టేసిన రకుల్..!

0
243
power peta
rakhul preeth singh with nithin

నిన్న మొన్నటివరకు హిట్ ప్లాప్ లంటూ తేడా లేకుండా.. సినిమాలలో దూసుకెళ్తున్న అమ్మడు ఛాన్స్ ల మీద ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఒక వైపుగా ‘మన్మథుడు’ సీక్వెల్ గా వస్తున్న ‘మన్మథుడు 2’ లో కింగ్ తో నటిస్తుంది.. మరో వైపు సూర్య తో నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగానే బెల్లంకొండ శ్రీనివాస్ తో మరో సారి జోడి కట్టడానికి సిద్దమవుతుంది. ఇంతేకాకుండా తాజాగా నితిన్ తో ముద్దుగుమ్మ జోడి కడుతుందని సమాచారం.

నితిన్ ఈ ఏడాది ఎంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ మూడు ప్రాజెక్ట్ లను చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈ సంవత్సరమే మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు హీరో. అయితే ఈ మధ్యే అతని బర్త్ డే ను పురస్కరించుకొని వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ‘భీష్మ’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో నితిన్ జోడిగా రష్మిక మందన నటిస్తుంది.

‘భీష్మ’ తో పాటే యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో నితిన్  సరసన రకుల్ పేరు ఖరారు చేసుకున్నట్లు సమాచారం. దీని కోసం రకుల్ ని దర్శకులు సంప్రదించగా ఓకే చెప్పేసిందట ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాల అనంతరం దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం ‘పవర్ పేట’ అనే మాస్ పేరు ను పరిశీలిస్తున్నారు.