రాజశేఖర్ కి హిట్ అందించేలా ‘కల్కి’ టీజర్..!

0
225
kalki
rajashekar kalki teaser released

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. రాజశేఖర్ కు జోడిగా ఆదా శర్మ.. నందిత శ్వేతా నటిస్తున్నారు. దశావతారలలో కల్కి చివరి అవాతారము 10 వ అవతారం కావున 10 వ తేదీన 10 గంటల 10 నిమిషాల 10 సెకన్స్ కి సినిమా టీజర్ ని విడుదల చేశారు. యాక్షన్ , ఎమోషన్ , సస్పెన్స్ తో పాటు థ్రిల్లింగ్ తలపించే సన్నివేశాలతో కట్ చేశారు.

చిత్రం మీద ఎంతో ఆసక్తిని పెంచే సీన్స్ తో టీజర్ ను కట్ చేయడంలో ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని రేపారు. ఇప్పటివరకు రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. పోలీస్ గా అచ్చొచ్చిన ఈ పాత్రలో నటించడం చూస్తుంటే తప్పక హిట్ కొడతాడని అభిమానులు అబిప్రాయపడుతున్నారు. విభిన్నమైన కథాకథనాలతో సాగే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించుటకు తెరముందుకు రాబోతుంది.

శివానీ,శివాత్మిక మూవీస్‌ పతాకం పై రాజశేఖర్‌ కూతుర్లు శివానీ, శివాత్మికలతో పాటు సి. కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌, పూజిత పొన్నాడ, నాజర్‌, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్‌ రాణా తదితర నటీనటులు నటిస్తున్నారు. చిత్రాన్ని మే నెలలో విడుదల చేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపారు.