మోదీకి నిలువెల్లా ద్వేషమెందుకు?

0
139

ప్రేమాభిమానాలతో నిండిపోయిన ఈ దేశంలో ప్రధాని మోదీ మాత్రం వ్యక్తిగత ద్వేషంతో నిండిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ తనపై నిలువెల్లా ద్వేషాన్ని నింపుకున్నారన్నారు. పబ్లిక్ ఫంక్షన్లలో మోదీని తాను ఎంతో అభిమానంతో కలుస్తానని, ఎంతో గౌరవంతో మాట్లాడతానని.. ఆయన మాత్రం తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని అన్నారు.

కేవలం ప్రసంగించడం, కామెంట్లు చేయడం మాత్రమే ప్రధాని బాధ్యత అనే విధంగా మోదీ తీరు ఉంటుందని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక స్థితిని మన్మోహన్ సింగ్ ఎంతో వ్యూహాత్మకంగా మెరుగు పరిస్తే.. మోదీ కి దేశ భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించడమే తెలియదని విమర్శించారు. ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోందని రాహుల్ అన్నారు.