ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6,000 : రాహుల్ సంచలన ప్రకటన

0
76
ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6,000 : రాహుల్ సంచలన ప్రకటన
ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6,000 : రాహుల్ సంచలన ప్రకటన

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్న ఆయన, కనీస ఆదాయ పథకం విధి విధానాలు ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6 వేలు ఇస్తాము అన్న రాహుల్ గాంధీ… ఆ మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తామని హామీ ఇచ్చాడు.. కానీ నెలకు రూ.12,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని నిబందన పెట్టింది కాంగ్రెస్.

ఈ పథకం ద్వారా దేశంలో 25 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ పథకం ద్వారా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువ మందికి చేరువవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదివరకు “ఉపాధి హామీ పథకం” యూపీఏ ప్రభుత్వానికి కలిసొచ్చిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత రైతు “రుణ మాఫీ” ప్రకటన ద్వారా యూపీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈసారి పేదలకు కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించింది కాంగ్రెస్.