ర‌ఘువీరారెడ్డి రాజీనామా..!

0
222

2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వ‌రుస ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ ఇటీవ‌ల రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ప‌లువురు ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాహుల్ గాంధీ రాజీనామాను ఉప సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు య‌త్నించారు. అయితే, రాహుల్ గాంధీ నిజంగానే రాజీనామా చేశారా..? పార్టీ శ్రేణుల డిమాండ్ మేర‌కు ఆ రాజీనామాను ఉప సంహ‌రించుకున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి స‌మాచారం తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ ఘోర ఓట‌మిపాలైన రాష్ట్రాల్లోను రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. మొన్న‌టికి మొన్న తెలంగాణ‌లో పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రాజీనామా చేయ‌గా, తాజాగా ఆ లిస్టులో ఏపీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి వ‌చ్చి చేరారు. ఏపీలో పార్టీ ఓట‌మికి అధ్య‌క్షుడిగా బాధ్య‌త వ‌హిస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని ఢిల్లీ అధిష్టానానికి పంపిన‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.