వీరి ముగ్గురి గురించి ‘లారెన్స్’ చెప్పిన మాటలు వింటే షాకవుతారు..!

0
125
raghava lawrance tell about this heros

రాఘవ లారెన్స్ సినిమా ‘కాంచన 3’ ఈ నెల 19 వ తేదిన విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. రాఘవ లారెన్స్ అత్యంత ఇష్టపడే వారిలో ముగ్గురు హీరోలున్నారంటూ అందులో ఒకరు మెగా స్టార్ చిరంజీవి, మరొకరు కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ రజినీకాంత్ అని.. లారెన్స్ జీవితం లో  ముగ్గురి హీరోల ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియ చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ వేడుకలో లారెన్స్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇంతటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నానంటే కారణం సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ర్టీ కి తీసుకొని రావడం అని చెప్పుకొచ్చారు. ఇక మెగా స్టార్ చిరంజీవి గురుంచి చూస్తే ఒక చిన్నకథ చెప్పి.. చిరంజీవిని లారెన్స్ జీవితం లో దేవుడు అని చెప్పారు. అతనిలో ఉన్న డాన్స్ ప్రతిభను గుర్తించి హిట్లర్ సినిమాలో అవకాశము కలిపించారని చెప్పారు. డాన్స్ కోరియోగ్రఫర్ గా.. నా జీవితానికి దారి చూపింది చిరు అయితే ఒక దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నాగార్జున అని చెప్పారు. ఇంత అందమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నానంటే వీరే నాకు కారణం… నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇలాంటి కష్టాలు ఎవరు పడకూడదని చారిటబుల్ ట్రస్ట్ ని హైదరాబాద్ లో మొదలు పెడుతున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా హైద్రాబాద్ లోనే డాన్స్ జీవితం మొదలు పెట్టాను కాబట్టి ట్రస్ట్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పి.. చారిటబుల్ ట్రస్ట్ కి మొదటగా 50 లక్షల రూపాయలను తనవంతుగా ఇస్తున్నట్లు చెప్పారు.. అదే విధంగా చిరంజీవి 10 లక్షల రూపాయలను ఇచ్చినట్లు పేర్కొన్నారు.

‘కాంచన3’ ని తెలుగులోనూ, తమిళంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో నిర్మాత బి.మధు విడుదల చేయగా, లారెన్స్ సరసన బిగ్బాస్ ఫేమ్ ఓవియా, వేదిక, నటిస్తున్నారు.