సింధు కి బంపర్ ఆఫర్.. కోహ్లి తో సమానంగా..!

0
244

బ్యాడ్మింటన్ ఆటలో ఎన్నో విజయాలను అందుకుంటున్న పివి సింధు ఇపుడు మరొక ముందడుగు వేసింది…సంపాదనలో క్రికెటర్ కొహ్లీతో పోటీ పడేందుకు సిద్దం అవుతుంది.. తాజాగా ఈ ఆఫర్ ని కొట్టేసింది సింధు… చైనా కి చెందిన ప్రముఖ లీ నింగ్ అనే కంపెనీతో రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది సింధు…ఈ కంపనీకి సింధు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది…దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది.

అయితే ప్రస్తుతం ఈ ఒప్పందం చరిత్రలో భారీ ఒప్పందంగా పేరు పొందింది. ఇపుడు ఈ ఒప్పందాన్ని పుమాతో టీమిండియా విరాట్ చేసుకున్న ఒప్పందంతో దీన్ని పోలుస్తున్నారు. పుమా కంపెనీతో 2017లో కోహ్లి రూ.100 కోట్ల మేర ఒప్పందం చేసుకున్న విషయం తెల్సిందే! దీని ప్రకారం కోహ్లికి ఏడాదికి రూ.12.5 కోట్ల మేర అందనుంది. గత నెలలో ఇదే సంస్థ కిదాంబి శ్రీకాంత్తో నాలుగేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. ఇందుకుగాను రూ.35 కోట్లు ఆఫర్ ఇచ్చింది. కశ్యప్తోనూ లీ నింగ్ రూ.8 కోట్లకు రెండేళ్లపాటు ఒప్పందం చేసుకుంది.`

గతం లో ఆదాయం విషయంలో క్రికెటర్లతో వేరే క్రీడాకారులకు యే మాత్రం పోలిక ఉండేది కాదు. కానీ ఈరోజు ఒక అమ్మాయి.. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లికి సమానంగా వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది పూసర్ల వెంకట సింధు. కోహ్లి 8 ఏళ్లకురూ.100 కోట్లతో ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే.. సింధు నాలుగేళ్ల కు ఒప్పందం కింద రూ.50 కోట్లు దక్కించుకోవడం విశేషం.