టీటీడీలో ఉద్యోగాలు క‌ల్పించాల‌ని లెట‌ర్‌లు రాశా : పుట్టా సుధాక‌ర్‌

0
88

ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌స్తే టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ అన్నారు. ఆయ‌న్ను ప‌ల‌క‌రించిన మీడియా ప్ర‌తినిధితో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆయ‌న చెప్పుకొచ్చారు. సిమ్స్ నియామ‌కాల‌కు సంబంధించి త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ వ్య‌వ‌హారినికి సంబంధించి త‌న‌తోపాటు డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌పై కూడా విచార‌ణ చేయాల‌ని ఆయ‌న అన్నారు.

తాను రాజ‌కీయ నాయ‌కుడిని క‌నుక త‌మ వ‌ద్ద‌కు ఎంతో మంది ఉద్యోగాలు కావాల‌ని వ‌స్తారని, అలాంటి వారికి ఉద్యోగాలు క‌ల్పించాలంటూ ఒక‌టిరెండు లెట‌ర్లు రాసిన మాట వాస్త‌వ‌మేన‌ని పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తెలిపారు. అలా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని సంతృప్తి ప‌ర‌చ‌డం కోసమే తాను లెట‌ర్ ఇచ్చామ‌ని చెప్పారు.

ఇలా తాను ఉద్యోగాల క‌ల్ప‌న‌లో గోల్‌మాల్ జ‌రిగిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని, న‌క్క‌చ్చిగ‌ల ఒక ప్ర‌భుత్వ అధికారి చేత విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే త‌న‌తోపాటు డైరెక్ట‌ర్ ర‌వి కుమార్‌పై కూడా విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. ర‌వికుమార్ అనే వ్య‌క్తి డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి అవినీతి కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయంటూ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.