ఏపీ డిప్యూటీ సీఎంకు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

0
1050

ఏపీ డిప్యూటీ సీఎంకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాగా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గం ఏర్పాటులో భాగంగా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉప ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. వారిలో ఒక‌రు కుర‌పాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి ఒక‌రు.

జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్కించుకున్న పుష్ప శ్రీవాణి ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారిగా త‌న సొంత జిల్లాలో ప‌ర్య‌టన నిమిత్తం ఈ రోజు విజ‌య‌న‌గ‌రంకు చేరుకున్నారు. పుష్ప శ్రీ వాణికి స్వాగ‌త ఏర్పాట్ల‌లో భాగంగా వైసీపీ శ్రేణులు భారీ క‌టౌట్‌లు, వేదిక‌ల‌ను ఏర్పాటు చేశారు.

అయితే రాజాపులోవ వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక‌పై పుష్ప శ్రీ వాణి వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతుండ‌గా.., ఒక్క‌సారిగా వేదిక ప‌క్క‌కు ఒరిగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పార్టీ నాయ‌కులు పుష్‌ప శ్రీవాణిని వెంట‌నే కింద‌కు దించేశారు. కొద్దిసేప‌టికే వేదిక.. వేదిక నేల‌మ‌ట్ట‌మైంది.