పుష్పా శ్రీ‌వాణి : నా చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాన‌న్నా..!

0
372

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తీసుకోనున్న ప్ర‌తి నిర్ణ‌యం కూడా దేశంలోని ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు రాష్ట్రంవైపు చూసే విధంద‌గా, ఆద‌ర్శ‌ప్రాయంగా ఉంటుంద‌ని కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్పా శ్రీ వాణి అన్నారు. కాగా, ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ తొలి కేబినేట్‌లో మంత్రిగా త‌న‌కు చోటు ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు.

సీఎంగా జ‌గ‌న్ నేతృత్వంలో తొలిసారి ఏర్పాటు కానున్న కేబినేట్‌లో 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని, రెండున్న‌రేళ్ల త‌రువాత మ‌రో 90 శాతం మందికి అవ‌కాశం ఇస్తానని జ‌గ‌న్ చెప్పార‌ని పుష్పా శ్రీ వాణి తెలిపారు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ఆయ‌న ప‌రిపాల‌నా తీరు అన్ని కూడా ప్ర‌తి ఒక్క‌రు కూడా హ‌ర్షింఏలా ఉన్నాయ‌న్నారు.

గ‌తంలో వైసీపీ ప్ర‌త్య‌ర్ధి పార్టీలు వైఎస్ జ‌గ‌న్‌పై విష ప్ర‌చారం చేశాయ‌ని, కానీ వాట‌న్నిటికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు పోతున్నార‌న్నారు. ఇంత మంచి నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్ కేబినేట్‌లో తామంతా మంత్రులుగా ఉండ‌టం తామంద‌రి అదృష్ట‌మ‌ని ఆమె అన్నారు. త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే ఉంటాన‌ని పుష్పా శ్రీ‌వాణి చెప్పారు.