టైటిల్‌లోనే త‌న క‌సి చూపిన‌ పూరీ..!

0
246

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అభిమానుల ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు.? హలో గురు ప్రేమకోసమే తర్వాత రామ్ నటించే సినిమా ఏమైంది..? అన్న సందేహాల‌ను నివృత్తి చేస్తూ సినీ జ‌నాల సస్పెన్స్ కు తెరపడింది. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతుంద‌న్న క్లారిటీ వ‌చ్చేసింది. వీరి కాంబోలో రాబోతున్న చిత్రానికి ఇస్మార్ట్ శంక‌ర్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు.

అయితే, పూరీ జ‌గ‌న్నాథ్‌ సినిమా టైటిల్ అంటే గ‌త చిత్రాలు లోఫర్, ఇడియట్ మాదిరి ఒక తిట్టు ఉంటుంద‌ని అనుకోవడం సహజం. కానీ, ఆ ఊహ‌ల‌న్నిటికీ భిన్నంగా రామ్‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రానికి వైవిధ్యమైన టైటిల్‌ను సెలక్ట్ చేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్స్ ని పల్లెటూరులో ఇస్మార్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇదే పేరు పూరీ సినిమా టైటిల్ అయింది. ఎనిమిది నెల‌లు గ్యాప్‌తో కసిగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ఆక‌లిని ఎలా తీర్చుకుంటున్నాడో అన్న‌ది ఈ టైటిల్ ద్వారా తెలుస్తుంద‌ని సినీ జ‌నాలు అంటున్నారు.

పూరీ జ‌గ‌న్నాథ్ తాను మ‌రో సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాన‌ని చెప్పడం ఆలస్యం షూటింగ్ మొదలు కాకుండానే టైటిల్ చెప్పేశాడు. రామ్‌తో క‌లిసి ఎప్పుడు ఫోటో షూట్ నిర్వహించాడో కానీ, అందుకు సంబంధించిన మోషన్ పిక్చర్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయింది. ఈ ఒక్క విష‌యం చాలు పూరీ స్పీడును క్యాలుక్యులేట్ చేయ‌లేమ‌ని చెప్ప‌డానికి అంటూ సినీ జ‌నాలు స్పందిస్తున్నారు.