అంతుచిక్క‌ని.. పూరీజ‌గ‌న్నాథ ఆల‌య ర‌హ‌స్యాలు..!

0
859

మ‌న దేశంలోని ఎన్నో పుణ్య క్షేత్రాల్లో పూరీజ‌గ‌న్నాథుని ఆల‌యం ఒక‌టి. నిత్యం భ‌క్తుల తాకిడితో పూజా కార్య‌క్రమాల‌ను అందుకుంటున్న ఈ పూరీజ‌గ‌న్నాథుని ఆల‌యం బంగాళ‌ఖాతం తీరాన భువ‌నేశ్వ‌ర్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌యం సంద‌ర్శ‌న నిమిత్తం ఆ ప్రాంతానికి చేరుకున్న ఎవ్వ‌రికైనా.. ఎంత దూరంలో ఉన్నా ఆల‌య గోపురం క‌నిపిస్తుంది. అంతేకాదు, గోపురం పైన ఉన్న సుద‌ర్శ‌న చ‌క్రం ఎటునుంచి చూసినా వారికి ఎదురుగానే ఉన్న‌ట్టు క‌నిపించ‌డం ఈ ఆల‌య విశిష్ట‌ల‌లో ఒక‌టి. ఇటువంటి పూరీజ‌గ‌న్నాథుని ఆల‌య విశిష్ట‌త‌లు ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో..!