“పుల్వామా దాడి”తో సంబంధం ఉన్న లోకల్ ఉగ్రవాది అరెస్టు

0
173
“పుల్వామా దాడి”తో సంబంధం ఉన్న లోకల్ ఉగ్రవాది అరెస్టు
“పుల్వామా దాడి”తో సంబంధం ఉన్న లోకల్ ఉగ్రవాది అరెస్టు

పుల్వమా ఉగ్రదాడి భారత సైనికులను ఎంత మందిని పొట్టన పెట్టుకుందో తెలిసిందే.. ఈ దాడితో దేశప్రజల రక్తం మరిగిపోయింది. దాంతో శాంతి శాంతి అని కూర్చుంటే లాభం లేదు.. పాకిస్తాన్ ని భూస్థాపితం చేయడమే ఈ సమస్యకు అసలు పరిష్కారం అంటూ ముక్తకంఠంతో తమ స్వరం వినిపించారు. దానికి ప్రదాని మోధి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. వారి ఊహకుసైతం అందని రీతిలో పాక్ లోకి ప్రవేశించి, అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి విజయవంతంగా వెనక్కి వచ్చింది.

అలాంటి పుల్వామా దాడికి ప్లాన్ వేసిన సూత్రధారి “ముదసిర్ అహ్మద్ ఖాన్‌”కు సహకరించిన “జైషే” వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో గతరాత్రి ఈ అరెస్టు జరిగింది. పుల్వామా జిల్లాకు చెందిన “సజ్జద్ ఖాన్‌” అనే లోకల్ ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని… కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో “సజ్జద్ ఖాన్” కూడా ఉన్నాడు. ఇక పుల్వామా దాడికి సూత్రధారిగా వ్యవహరించిన “ముదసిర్ అహ్మద్ ఖాన్‌”ను ఇటీవల పోలీసులు “ఎన్‌కౌంటర్‌”లో షూట్ చేసిన విషయం తెలిసిందే.