పుల్వామా దాడి : వెలుగులోకి నివ్వెర పోయే నిజాలు..!

0
245

పుల్వామా దాడి వెనుక కుట్ర‌ల‌ను చూసి అధికారులే నివ్వెర‌పోతున్నారు. జైషే ఉగ్ర‌వాదులు త‌మ‌కు అందుబాటులో ఉన్న అన్ని ర‌కాల అత్యాధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకుంటున్నారు. కుట్ర‌ను చేదించేకొద్దీ సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

పుల్వామా దాడి కోసం కారు బాంబు నిపుణులు దేశంలోకి చొర‌బ‌డిన‌ట్టు తేలింది. తాజాగా అత్యాధునిక వ‌ర్చువ‌ల్ సిమ్‌ల‌ను పుల్వామా దాడి కోసం వినియోగించిన‌ట్టు అధికారులు గుర్తించారు. ముంబై దాడుల‌కు కూడా ఇటువంటి టెక్నాల‌జీనే ఉగ్ర‌వాదులు వాడిన‌ట్టు తెలుస్తుంది.

దీంతో ఈ సిమ్‌ల స‌మాచారాన్ని సేక‌రించ‌డం భార‌త్‌కు క‌ష్ట‌త‌రంగా మారింది. సిమ్‌ల స‌మాచారాన్ని సేక‌రించేందుకు భార‌త్ ఇప్ప‌టికే అమెరికా సాయం కోరింది. పుల్వామా దాడి బాంబ‌ర్ ఆదిల్ దాడి చేసే వ‌ర‌కు సూత్ర‌ధారి అయిన మ‌ద‌ర్‌సిస్ ఖాన్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు గుర్తించారు.