సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి : శ్రావణి తల్లిదండ్రుల ఆమరణ దీక్ష

0
221
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి : శ్రావణి తల్లిదండ్రుల ఆమరణ దీక్ష
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి : శ్రావణి తల్లిదండ్రుల ఆమరణ దీక్ష

మన దేశంలో చట్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందమంది దొషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే చట్టం మంచిదే.. కానీ నేటి ఆధునిక యుగంలో ఈ లాంటి చట్టల్లో కొంత మార్పు రావాలి అంటున్నారు విశ్లేషకులు. మన రాజకీయ నాయకులు తమ పార్టీలకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటున్నప్పుడు ఇలాంటి చట్టాలను ఎందుకు మార్చకూడదు ? అనేది వారి వాదన. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేదు. ఎవరో చెప్పిన సాక్షాన్ని బట్టి శిక్ష వేసేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం నిజమా ? కదా ? అని ఒకటికి, పదిసార్లు ఆలోచించి శిక్షలు కరారు చేసేవి కోర్టులు.

కానీ ఇప్పుడు అలా కాదు కళ్ళముందే హత్యలు చేస్తున్నా, వాటిని వీడియో తీసి సాక్ష్యంగా కోర్టులో ఇచ్చినా అదే పాత చట్టాన్ని ఫాలో అవుతూ.. ఇతడు నిజంగా తప్పు చేశాడా లేదా ? అంటూ సమయం వృదా చేయడమే కాక ఒక్కో కేసును ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే తప్పు చేయాలనుకునేవాడు దైర్యంగా తప్పు చేస్తూ.. డబ్బులు ఉంటే లంచం ఇచ్చిమరీ “నేనేతప్పు చేయలేదు” అంటూ బయటకు వచ్చేస్తున్నాడు.

ఇప్పుడు హాజీపూర్ సైకో కిల్లర్ కేసుకుడా అలాగే అవుతుందేమోనని అక్కడి గ్రామ ప్రజలు బయపడుతున్నారు. గత 20 రోజులుగా శ్రీనివాస్ రెడ్డిని అటు ఇటు తిప్పుతున్నారు తప్ప అతడికి ఇంకా శిక్ష కరారు చేయలేదు కోర్టు. శ్రీనివాస్ రెడ్డి తను చేసిన తప్పులను ఇప్పటికే ఒప్పుకున్నాడు.. కల్పనా, శ్రావణి, మనీషాలను నేనే హత్యాచారం చేసి, చంపేశాను అని ఒప్పుకున్నా… మన చట్టల్లో ఉన్న లొసుగుల వల్ల అతడికి ఇంకా శిక్ష కరారు కాలేదు. అందుకే ఆ సైకోకు వెంటనే తగిన శిక్ష వేయాలని.. అప్పటివరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోమని శ్రావణి తల్లిదండ్రులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.