జగన్ కోసమే ఇదంతా.. పృథ్వీరాజ్ ..!

0
320
pruthviraj

వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడైన పృథ్వీరాజ్ శ్రీ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ .. ఈరోజు వరకు నా జీవితం లో నాకోసం నేను ఏమి కోరుకోలేదు.. నా కుటుంబం కోసం కూడా ఏమి మొక్కలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకోవడమే కాకుండా , తలనీలాలు మొట్టమొదటి సారిగా ఇచ్చాను. వైసీపీ అధినేత కు అధికార పగ్గాలు చేతికి రావడానికి.. ఎలాంటి అడ్డంకులు ఏర్పడకూడదని కోరుకున్నాను. ఆయన పాలన , సేవ ప్రజలకు అందచేయాలని శ్రీవారిని కోరుకున్నట్లు తేలియాయ్ చేశాడు.

పృథ్వీరాజ్ తో పాటు శ్రీ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్న ఇంకో వైసీపీ నేత కొడాలి నాని మీడియా తో మాట్లాడుతూ.. వైసీపీ అత్యధిక స్థానాలను సాదించాలని , జగన్ ముఖ్యమంత్రి కావాలని , ప్రజల క్షేమం కోరే జగనన్న రావాలని వేడుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా కరువు పరిస్థితుల భారీ నుంచి రాష్ట్రాన్ని కాపాడమని ఏడుకొండల స్వామిని కోరుకున్నానని తెలిపారు.