రెవెన్యూ శాఖ‌లో అవినీతికి కార‌కులు రాజ‌కీయ నాయకులేనా..?

0
202

తెలంగాణ‌లో రెవెన్యూశాఖ‌ను ప్ర‌క్షాళన చేసేందుకు ముఖ్య‌మంత్రి స్థాయిలో పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు న‌డుస్తుండ‌టంతో స‌మ‌స్య‌లు, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం మేధావుల‌తో రౌండ్‌టేబుల్ స‌మావేశం నిర్వ‌హించింది.

ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ‌లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. వ్య‌వ‌స్థ మార‌నంత వ‌ర‌కు అధికారుల‌పై రాజ‌కీయ నాయ‌కులు పెత్త‌నం చేస్తార‌ని, ఉద్యోగుల ప‌ని సంస్కృతి మార‌కుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్వ‌ని స‌మావేశంలో పాల్గొన్న వ‌క్త‌లు పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు, ఉద్యోగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వ‌స్తే ప్ర‌భుత్వ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని వారు వెల్ల‌డించారు. రాజ‌కీయ నాయ‌కుల అవినీతి పోకుండా, ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్య‌మ‌ని వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. సంస్క‌ర‌ణ‌ల‌ను తాము స్వాగ‌తిస్తున్నామ‌ని, అయితే, వ్య‌వ‌స్థంలోని లోపాల‌కు త‌మ‌ను బాధ్యులను చేయ‌డం స‌రికాద‌న్న‌ది వారి అభిప్రాయం.